చంద్రబాబు కేసుల్లో కీలకమైన పాయింట్‌ అదే?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు దాదాపు బయటకి రావడం కష్టమే అని వైసీపీ నేతలతో పాటు టీడీపీ శ్రేణులు భావించారు. చంద్రబాబుకి బెయిల్ రావాలని ఆయన తరఫు సుప్రీం కోర్టు లాయర్లు శత విధాలా ప్రయత్నం చేశారు.  చివరకు అనారోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది. కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.


ఇప్పుడు అన్నీ కళ్లు సుప్రీం కోర్టు వైపు మళ్లాయి.  నవంబరు 8,9 తేదీల్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే పలు దఫాలు క్వాష్ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీం ధర్మాసునం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబరు పదో తేదికి వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయొద్దని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసుతీర్పులన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి.


చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో కొన్ని షరతులు విధించాలని సీఐడీ కోరగా దానికి సంబంధించిన తీర్పు వాయిదా వేసింది. ఒకవేళ క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అంగీకరిస్తే మధ్యంతర బెయిల్ అవసరం లేదు. క్వాష్ కాకపోతే మాత్రం మధ్యంతర బెయిల్ అవసరం అవుతుంది. తాజాగా అసైన్డ్ భూముల వ్యవహారంలో విచారణ కూడా  ఈనెల 10 కి వాయిదా వేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు లో చంద్రబాబుకి క్వాష్ పిటిషన్ లో అనుకూల తీర్పు వస్తే ఇక తిరుగుండదు. లేకపోతే ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూములు, లిక్కర్ కుంభకోణం ఇవన్నీ మళ్లీ తెరపైకి వస్తాయి. చంద్రబాబుని జైలులో ఉండేలా వారు ప్రణాళికలు రచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: