ఆ లా పాయింట్‌ బాబుకు బెయిల్‌ తెస్తుందా?

చంద్రబాబు నాయుడు అరెస్టు తాజాగా రాజకీయాల్లో పెద్ద సంచలనం అయ్యింది. రాజకీయాల్లో వచ్చిన ఈ అకస్మాత్తు పరిణామం భవిష్యత్తు ఎన్నికలపై తన ప్రభావాన్ని చూపించబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమైన పార్టీలైన తెలుగుదేశం పార్టీ అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు ఒక ప్రయోజనం ఉందని వాళ్ళు అంటున్న మాట.

మరి ఏంటి ఆ ప్రయోజనం అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే   తెలుగుదేశం పార్టీ లాంటి ఒక ముఖ్యమైన పార్టీ అధినేత జైల్లో ఉండడం వల్ల జగన్ కు వచ్చే ఏడాది ఎలక్షన్లో పోటీ ఉండదంటున్నారు. మరోపక్క  ఇండియా టుడే ఇచ్చిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి  గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియడం జరిగింది. అంతే కాకుండా ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు  అరెస్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో సింపతి అనేది పెరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసి రాబోతుంది అని వీళ్ళు అంటున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన  తర్వాత బెయిల్ కి అప్లికేషన్ పెట్టుకోలేదట. అయితే ఇలా చేయడం వెనుక ఒక టెక్నికల్ పాయింట్ ఉందని అంటున్నారు మేధావులు. అయితే బెయిల్ కి అప్లికేషన్ పెట్టకపోయినా కూడా రిమాండ్ ఇచ్చిన రోజే పోలీసు కస్టడీకి పిటిషన్ వేశారని తెలుస్తుంది. పోలీసు కస్టడీ పిటిషన్  డిస్పోజల్ అవకుండా బెయిల్ గురించి వాదన విన్నా కూడా బెయిల్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుందట.

17 ఏ గురించి ప్రధానంగా వాదనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 17 ఏ అమెండ్ అయ్యాక గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. దేనికి అంటే ఎంక్వయిరీ,  ఇన్విస్టిగేషన్ కి ఆయన అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా తీసుకోకుండా చట్ట ఉల్లంఘన చేశారు కాబట్టి దానిని పరిగణన లోకి తీసుకోకూడదని న్యాయవాదులు వాదించారని  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: