అప్పుడే పవర్‌లోకి వచ్చినట్టు ఫీలవుతున్న టీడీపీ?

పరిస్థితులు ఎవరికీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. అది రాజకీయంలోనైనా, వ్యాపారంలోనైనా మరి ఏ విషయంలోనైనా ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  ఒకసారి సుఖం, ఒకసారి కష్టం. ఒకరోజు లాభం, మరొక రోజు నష్టం. ఈ విధంగానే పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏ పరిస్థితీ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో మంచి ఫామ్ లో ఉన్న పార్టీ. 1983లో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ.

ఆ తర్వాత నందమూరి తారక రామారావు తన పరిపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో టిడిపిని నడిపించారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 1995 నుండి 2004 వరకు 9 ఏళ్ళు నిరాటంకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ తర్వాత 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండిపోయినా తిరిగి 2014 నుండి  2019 వరకు మళ్లీ తన పరిపాలనను విజయవంతంగా కొనసాగించారు.

కానీ కొన్ని కారణాల వల్ల 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వరుసగా ఎన్నో అపజయాలని ఎదుర్కొంటూ  వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఇలా ప్రతి ఎన్నికలలోనూ ఓటమి పాలవుతూ వచ్చింది. అలాంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం ఢీలా పడిపోయిన పరిస్థితి ఏర్పడింది‌.

అలాంటి సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు టిక్కెట్లు ఇవ్వడం లేదని కోటంరెడ్డి, ఆనం నారాయణ రెడ్డి లాంటివాళ్ళు తెలుగు దేశం పార్టీ వైపు మళ్ళడం అనేది తెలుగు దేశం పార్టీకి ఒక శుభ పరిణామం. ఆ తర్వాత గెలవడం అసాధ్యం అనుకున్న ఒక ఎమ్మెల్సీ స్ధానం గెలవడం టిడిపికి ఒక మంచి ఊపు. తాజాగా ఇండియా టుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇచ్చిన సర్వే వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అయితే ఫుల్ ఖుషి గా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: