ఆ విషయాల్లో కేసీఆర్‌ కంటే జగన్‌ చాలా బెటర్‌?

పాలన అనుభవం లేదంటూ పదేపదే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటాయి కొన్ని పత్రికలు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట పదే పదే అంటూ ఉంటారు. పోల్చి చూడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అలాంటి సందర్భంలో పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తో పోల్చి చూడాలి.  


పోనీ జగన్ కు పాలనా అనుభవం లేదు అంటున్నారు ఓకే. కానీ కెసిఆర్ కు ఎంతో పాలనా అనుభవం ఉంది కదా. తెలంగాణలో రేషన్ కోసం ఇంకా క్యూ లైన్స్ లోనే నిలుచుంటున్నారు చాలా చోట్ల. మరి జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న ఆంధ్ర ప్రాంతంలో అయితే ఈ రేషన్ ని కూడా ఇంటి దగ్గరకే తీసుకు వచ్చి ఇస్తున్నారు. పరిపాలన విధానం విషయంలో ఆంధ్రకి తెలంగాణకి మధ్య ఉన్న తేడా గురించి చెప్పుకోవాలంటే ఇదొక పాయింట్.


ఇక రెండో పాయింట్ వచ్చేసరికి 2018ఎలక్షన్లకు ముందు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం అప్లై చేసుకోమంది తెలంగాణ ప్రభుత్వం. ఆ సందర్భంలో తెలంగాణలో చాలా ఊర్లలో లక్షలాది మంది ప్రజలు ఎమ్మార్వో ఆఫీసుల ముందు క్యూలు కట్టిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత గృహ లక్ష్మీ పథకం కింద ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. దాంతో మళ్ళీ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర, ఈ సేవా సెంటర్ దగ్గర క్యూ లైన్ లో కనిపిస్తున్నారు జనాలు.


ఇల్లు కట్టించి ఇస్తానన్న కేసీఆర్ కూడా మాట తప్పిన పరిస్థితి అక్కడ. అయితే ఇక్కడ ఆంధ్రాలో చూస్తే ఇళ్ళు కోసం గానీ, ఇళ్ల స్థలాల కోసం గానీ, ఇళ్ల పట్టాల కోసం కానీ ఏ ఒక్క మనిషి కూడా క్యూలో నిలుచున్న పరిస్థితి లేదు. అప్పటికి జగన్ ఎన్నో మార్పులు చేసుకు వస్తున్నా కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి కి పరిపాలన అనుభవం లేదు అనే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: