మోదీకి పెద్ద పరీక్షే పెట్టిన కేసీఆర్.. ఏం చేస్తారో?
కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి. అప్పుడు చంద్రబాబు చెప్పిన అడ్డు పడడంతో ప్రత్యేక తెలంగాణను ఇవ్వలేదని అంటారు. అంతకు ముందు నుండి చంద్రబాబుతో ఉంటున్న కెసిఆర్, ఆ తర్వాత చంద్రబాబు నుండి బయటకు వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేశాక ఇప్పటివరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా నెగ్గుకొచ్చారు. గత తొమ్మిది ఏళ్లగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 6వేల కోట్ల విద్యుత్ బకాయిలను కావాలనే చెల్లించకుండా వచ్చారు కేసీఆర్. అయితే ఆ సొమ్మును ఇప్పుడు కేంద్రం ఇస్తానని చెప్పింది. అయితే ఇప్పుడు అదే విషయాన్ని కెసిఆర్ తన అస్త్రంగా వాడుకోబోతున్నారని తెలుస్తుంది. ఆర్టీసీ విలీనం అనే అంశాన్ని ప్రత్యేకంగా ఎత్త బోతున్నారు ఆయన.
ఆర్టీసీ విలీనం అనేది సెక్షన్9, సెక్షన్ 10 పరిధిలోకి వస్తుంది. దీనిలో కేంద్రం నిధులు ఉన్నాయి కాబట్టి కేంద్రం దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కేంద్రం పర్మిషన్ ఇస్తే కనుక ముందు ఆంధ్ర వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోతే కనుక ఆంధ్రకు అన్యాయం చేసినట్లు అవుతుంది. ఒకవేళ ఇస్తే తెలంగాణకు అన్యాయం జరిగినట్లుగా కేసీఆర్ పాయింట్ రైజ్ చేయబోతున్నారని సమాచారం. గవర్నర్ బిల్లును ఆమోదిస్తే గనుక ఆంధ్రకు నిధులు రానట్లే. మొత్తానికి కెసిఆర్ మోడీ సర్కార్ కు పెద్ద పరీక్ష పెట్టారు.