'అమరావతి'పై జగన్‌కు.. మోదీ ఫుల్‌ సపోర్ట్‌?

అమరావతి వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆర్ 5 జోన్ లో మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం 47 వేల ఇళ్లను సాంక్షన్ చేసేసింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దాకా వెళ్లినా నిర్ణయాన్ని రాష్ట్ర హై కోర్టుకు ఇచ్చింది. హై కోర్టు మాత్రం ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏకు డబ్బులిచ్చి మరి పనులు ప్రారంభించాలని చెప్పింది.

కానీ కొంతమంది ఏదో ఒక లిటిగేషన్ పెట్టేలా.. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. అయితే ఆర్ 5 జోన్ పట్టాల భూ బదలాయింపు వ్యవహరంలో సీనియర్ న్యాయవాది తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. ఇవాళ ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైతుల నుంచి సీఆర్డీఏకు భూములు పూర్తిగా బదిలీ కాలేదని, లేని అధికారంతో భూ బదలాయింపు చేస్తున్నారని ఇది చట్ట విరుద్ధమని అన్నారు.

రైతులు ఇచ్చిన భూములను అమ్మాలంటే సీఆర్డీఏ అనుమతి అవసరమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవే పిటిషన్లు గతంలో కూడా వేశారు. ఎందుకంటే అక్కడ ఇళ్ల నిర్మాణం జరగకుండా చూడాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు పోటా పోటీగా కేసులు వేస్తూ అమరావతి పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే అమరావతి పై సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టుల్లో కేసులు ఉన్నాయి.

కాబట్టి నిర్మాణాలు ఆపేయాలని కోరుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ది సంస్థ  హరిదీప్ సింగ్ పూరికీ అమరావతి పరిరక్షణ సంస్థ తరఫున లేఖ రాశారు. కోర్టుల్లో ఉన్న కేసులు తేలేదాక అమరాతి లో నిర్మాణాలు ఆపాలని కోరారు. అయితే దేశంతో కోర్టు కేసులు తక్షణమే తేలాలంటే అయ్యే పని కాదు. ఇలా కోర్టుల్లో అమరావతి రాజధాని నిర్మాణాలపై కేసులు వేస్తూ పోతే అది విశ్వ నగరంగా మారేదెప్పుడూ అది ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా నిలిచెదెపుడు అని చాలా మంది పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: