టీడీపీ సూపర్ సిక్స్ వైసీపీ నవరత్నాలు ప్లస్.. బాబు, జగన్ లలో ఎవరిని నమ్మాలి?

Reddy P Rajasekhar
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించగా వైసీపీ నవరత్నాలు ప్లస్ పేరుతో మరిన్ని బెనిఫిట్స్ ను జోడించి హామీలను ప్రకటించింది. కూటమి తరపున రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలకు సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా ఏడాదికి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అందించనున్నారు.
 
ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల నగదు అమలు కానుంది. రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి నిధి ఇస్తామని, ఇతర పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కూటమి నేతలు హామీ ఇస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం మరోసారి నవరత్నాలనే హామీలుగా ప్రకటించడం గమనార్హం.
 
తొమ్మిది ప్రధాన హామీలతో సంక్షేమ పథకాల అమలు కొనసాగింపు లక్ష్యంగా వైసీపీ అడుగులు పడుతున్నాయి. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్లు ఇతర హామీలను వైసీపీ అమలు చేయనుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.
 
బాబు, జగన్ లలో ఎవరిని నమ్మాలి అనే ప్రశ్నకు మాత్రం జగన్ నే నమ్మాలనే సమాధానం వినిపిస్తోంది. జగన్ అవసరం అనుకుంటే ఇష్టానుసారం అమలు సాధ్యం కాని హామీలను ప్రకటించవచ్చు. రుణమాఫీ ప్రకటించి ఉంటే సులువుగా వైసీపీ రాష్ట్రంలో కనీసం 130 సీట్లతో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేది. అయితే జగన్ మాత్రం అలాంటి రిస్క్ తీసుకోలేదు. చంద్రబాబు హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: