కేటీఆర్ : ఖమ్మం సిటీ ఎంపీ గురించి ఆసక్తికరమైన వివరాలు..!

Pulgam Srinivas
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చాలా రోజుల నుండి అనేక ప్రాంతాలను పర్యటిస్తూ వస్తున్నాడు. ఇక చాలా ప్రాంతాలను పర్యటిస్తూ రోడ్ షో లలో , బహిరంగ సభలలో పాల్గొంటూ నాయకులకు , కార్యకర్తలకు ఫుల్ జోష్ ను నింపుతున్న ఈయన ఏదైనా కాస్త సమయం మిగిలి ఉంటే దాన్ని సోషల్ మీడియాలో గడుపుతూ దాని ద్వారా కూడా తమ పార్టీని  తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.


ఇకపోతే తాజాగా కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ... పాల్వంచ పవర్ ప్లాంట్‌లో ఒక దినసరి కూలీగా జీవితం ప్రారంభించిన నామా నాగేశ్వర్ రావు ఆయన కృషితో , పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి సొంత కంపెనీలు స్థాపించే స్థాయికి చేరారు. ప్రస్తుతం ఆయన కొన్ని వేల మంది కి ఉపాధి అందిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ గా , పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా.. పార్టీ గళాన్ని లోక్‌సభ లో బలంగా ఆయన వినిపించారు. విభజన హామీలు , బయ్యారం ఉక్కు , కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా , రైల్వే ప్రాజెక్టులు , జాతీయ రహదారులు ఇలా ఎన్నో అంశాలను లోక్‌సభలో ఆయన లేవనెత్తారు.


రెండు పర్యాయాలు ఎంపీ గా పని చేసిన నామా నాగేశ్వర్ రావు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కితాబునందుకున్నారు. నామా ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది అభాగ్యులకు అండగా నిలిచారు. నామా గారి సీనియారిటీకి , సిన్సియారిటీకి మద్దతు తెలుపుతూ.. ఖమ్మం ఎంపీగా మరోసారి నామా నాగేశ్వర్ రావు గారినే భారీ మెజారిటీతో గెలిపిద్దాం ఖమ్మం ప్రజల గొంతుకను మళ్ళీ లోక్‌సభకు పంపిద్దాం అని కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: