"గేమ్ చేంజర్" మరింత ఆలస్యం... కారణం అదే..?

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో చాలా రోజుల క్రితం గేమ్ చెంజర్ అనే మూవీ మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు అయిన సమయంలో శంకర్ కేవలం ఈ సినిమాకు మాత్రమే కమిట్ అయి ఉన్నాడు.  శంకర్ , గేమ్ చేంజర్ మూవీ కంటే ముందే ఇండియన్ 2 అనే సినిమాను ప్రారంభించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దానితో ఆ సినిమాను ఆల్మోస్ట్ ఆపివేసినట్లే అనే ఉద్దేశంతో శంకర్ , చరణ్ తో మూవీకి కమిట్ అయ్యాడు.

కానీ ఆ తర్వాత మళ్లీ ఇండియన్ 2 మూవీ ని ప్రారంభించడంతో శంకర్ కొన్ని రోజులు ఇండియన్ 2 షూటింగ్ ను మరికొన్ని రోజులు గేమ్ చేంజర్ షూటింగ్ ను తెరకెక్కిస్తూ రావడంతో రెండు సినిమాల షూటింగ్ కూడా లేట్ అవుతూ వచ్చింది. ముందుగా ప్రారంభించిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక గేమ్ చేంజర్ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

ఇకపోతే జూన్ లో అనుకున్న ఇండియన్ 2 మూవీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసి మళ్లీ గేమ్ చేంజర్ పై శంకర్ కాన్సన్ట్రేషన్ పెట్టనున్నట్లు దానితో ఈ సంవత్సరం అక్టోబర్ , నవంబర్ నెలలో గేమ్ చేంజర్ విడుదల అయ్యే అవకాశం లేదు అని , ఒక వేళ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో గేమ్ చేంజెర్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: