రాజకీయాల గురించి మరోసారి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చిన చిరు..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడం అలాగే ఎన్నో సేవ పనులను చేసి ఎంతో మంది ప్రజలకు అండగా నిలబడడంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. ఇకపోతే నిన్న చిరంజీవి కి ఢిల్లీ లో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇక ఢిల్లీ లో ఈ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి తిరిగి ఈ రోజు హైదరాబాదు కు విచ్చేశారు. 

ఇకపోతే హైదరాబాదు లో ఈయన దిగగానే ఎయిర్ పోర్ట్ లో అనేక మంది మీడియా వ్యక్తులు ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ మీరు ప్రస్తుతం ఏ పార్టీ అని అడిగారు. దానికి చిరంజీవి నేను ఏ పార్టీ కాదు. పార్టీలకు అతీతమైన వ్యక్తిని అని ఆన్సర్ ఇచ్చాడు. ఇకపోతే గతం లోనే చిరంజీవి నేను ఎన్నో గొప్ప పనులు చేయాలి అని , ఎంతో మంది పేద ప్రజలను ఆదుకోవాలి అని ప్రజా రాజ్యం పార్టీని పెట్టాను. కానీ రాజకీయాల్లో నేను అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దానితో రాజకీయాలను వదిలి పెట్టాను. 

నన్ను నటుడి గా ఎంతో మంది ప్రేక్షకులు ఆదరించారు . మళ్లీ తిరిగి వారిని అలరించడానికి నటుడిగా సినిమాల్లో నటిస్తున్నాను. ఇక జీవిత కాలం సినిమాల్లో నటిస్తాను. కానీ రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పాడు . ఇక తాజాగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఇండైరెక్ట్ గా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పినట్లే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: