రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది.  అయితే ఇన్ని రోజులు ఉక్రెయిన్ లోని భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కౌంటర్ ఎటాక్ కు ఉక్రెయిన్ దిగుతోంది. బాగ్ పుత్ నగరానికి సమీపంలో ఉన్న అయిదు గ్రామాలను మొన్న స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్  ప్రకటించింది. ప్రస్తుతం  8 గ్రామాలను కూడా రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది. అయితే ఉక్రెయిన్ చెబుతున్నవి అన్ని అబద్ధాలని రష్యా  అంటోంది.

ఉక్రెయిన్ బాగ్ పుత్ సమీపంలోని పీఆర్ టీ ఖర్కివ్ అనే గ్రామాన్ని కైవసం చేసుకున్నామని చెబుతోంది. అయితే ఆ గ్రామంలో కేవలం అయిదు కుటుంబాలు మాత్రమే జీవిస్తాయని రష్యా తెలిపింది. ఇంత చిన్న గ్రామాన్ని కైవసం చేసుకునే సమయంలో దాదాపు 200 మంది సైనికులు చనిపోయారని బ్రిటన్ ప్రకటించింది. దాదాపు 33 యుద్ధ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.  అయిదు కుటుంబాలు ఉన్న గ్రామం కోసం భీకర దాడి జరిగినట్లు తెలుస్తోంది. 13 మిలిటరీ సపోర్టు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది.

ఉక్రెయిన్ లో ఉన్న ఎక్కువ స్టీల్ ప్లాంట్ లను రష్యా నాశనం చేసింది. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా స్టీల్ ఎగుమతి అయ్యేది. రష్యా ఆ ప్రాంతాల్లో పూర్తిగా స్టీల్ ను ప్లాంట్ లను ధ్వంసం చేసేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ స్టీల్ ప్లాంట్ ల అభివృద్ధి కోసం దాదాపు 40 బిలియన్ డాలర్లు అవసరం అని అమెరికా సాయం అందించాలని ఉక్రెయిన్ కోరుతుంది.

అలాగే మొత్తం ఉక్రెయిన్ పునర్ నిర్మాణానికి అమెరికా దాదాపు 460 బిలియన్ డాలర్లు అందించాలని జెలెన్ స్కీ అడుగుతున్నారు. ఉక్రెయిన్ తిరిగి కౌంటర్ ఎటాకింగ్ కు దిగడం దానికి అమెరికా, బ్రిటన్ దేశాలు సహకరించడం పై రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక యూరప్ దేశాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: