అల్లు శిరీష్ "బుడ్డి" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ.. సమయం వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో అల్లు శిరీష్ ఒకరు. ఈయన గౌరవం అనే మూవీ తో వెండి తేరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఇందులో ఆశిష్ తన నటనతో ప్రేక్షకులను పరవాలేదు అనే స్థాయిలో అలరించాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఈయనకు మంచి కమర్షియల్ విజయం దక్కింది.
 

ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే అల్లు శిరీష్ కొంత కాలం క్రితం ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శిరీష్ "బుడ్డి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది.

ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "ఆ పిల్ల కనులే" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా మే 15 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ లోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: