కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం.. కేసిఆర్ ఇదే చేయబోతున్నాడా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అయితే మూడోసారి కూడా కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేతలు అందరూ కూడా గట్టిగా నమ్మకం పెట్టుకున్నప్పటికీ.. చివరికి తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక్కసారి ఇలా బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఆ పార్టీ చివరికి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఒకప్పుడు అధికారంలో ఉండి కేసీఆర్ సీఎం కూర్చిలో కూర్చున్నప్పుడు ఎలా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా చేశారో.. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కారు పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా హస్తం గూటిలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు 25 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కీలక నేతలు కామెంట్స్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది. దీంతో ఇక రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని కూడా అటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో  ఇటీవల తెలంగాణ బిజెపి కీలక నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఒకప్పుడు హామీ ఇచ్చి అధికార దాహంతో బిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కేసీఆర్ విలీనం చేయలేదని.. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక  గులాబీ పార్టీని త్వరలోనే కాంగ్రెస్లో కేసీఆర్ విలీనం చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ఇప్పుడు చచ్చిన పాము. కారు గారేజ్ నుంచి వచ్చే అవకాశం లేదు. కారును స్క్రాప్ లో కూడా అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో బిజెపి ఒక శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుంది. ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తుంది అంటూ లక్ష్మణ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: