దేశానికి "తెలంగాణ మోడల్‌" ఆదర్శం అవుతుందా?

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ కోసం సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కున్న కష్టాలు, అవమానాలు, అధిగమించిన అడ్డంకులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తొమ్మిదేళ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం... అనుమానాలు పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలు దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులు తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమన్నారు.

ఒకనాడు వెనకబాటుకు గురైన తెలంగాణ నేడు సమస్త రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడం సంతృప్తిగా ఉందని తెలిపారు. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని.. తెలంగాణ వంటి పాలన కావాలని, అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం, అన్నింటా గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, తెలంగాణ ప్రగతి ప్రస్థానం మహోజ్వల స్థితికి చేరుకుందని.. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా, పండుగ వాతావారణంలో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందరకర సమయంలో సంతోషాలను పంచుకుంటూ దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములై ప్రజలందరూ వాడ వాడనా సంబురాలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: