నవనీత్‌ కౌర్‌: ఎంపీ అయినా తప్పని కుల వివక్ష?

తెలుగు చలనచిత్ర సీమలో హీరోయిన్ గా చేసి ఇప్పుడు కనుమరుగై పోయిన నవనీత్ కౌర్ ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆవిడ ఇప్పుడు అక్కడ ఎంపీగా గెలిచింది, అది కూడా ఇండిపెండెంట్ గా గెలిచింది. అయితే నవనీత్ కౌర్ ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆవిడ చెప్పే వరకు ఎవరికి తెలియలేదు. అది కూడా ఆవిడ ఎస్సీకి సంబంధించిన రిజర్వ్డ్ సీట్లోంచి పోటీ చేసినప్పుడు మాత్రమే తెలిసింది ఆ విషయం‌.

ఇంకో విషయం ఏంటంటే ఆవిడ చక్కటి ప్రతిభావంతురాలు, లాంగ్వేజ్ మీద పట్టు ఉంది. ఆవిడ దగ్గర సబ్జెక్ట్ ఉంది, అలాగే దళిత, బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి కనుక వ్యవస్థలో ఉంటే ఎలా ఉంటాదో దానికి సజీవ సాక్ష్యం. అంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా వివక్ష ఎదుర్కొంది ఈ సమాజంలో.

నిజానికి చాలామంది రిజర్వేషన్ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కానీ రిజర్వేషన్ ఇచ్చింది ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకొని కాదని, చాలాకాలం నుండి, అంటే దశాబ్దాలుగా కాదు శతాబ్దాల నుంచి కూడా కులం పేరుతో ఇలా చాలామందిని అవమానించారని, మిగతా వాళ్లతో సమానంగా చూడకుండా అవమానించారని, అలా అవమానపడిన వాళ్లు మిగతా వాళ్లతో సమాన స్థాయికి ఎదగడం కోసం ఇవ్వబడినవే రిజర్వేషన్లు. అవి లేకపోతే ఆప్పటికీ వీళ్ళని అణచివేసే ధోరణే ఉండేది సమాజంలో.. ఇది అందరూ అంగీకరించవలసిన సత్యమే.
దానికి సజీవ సాక్ష్యం నవనీత్ ను మొన్న అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు కనీసం తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేదంట . నువ్వు తాగిన గ్లాస్ తో మేము ఎలా తాగుతామంటూ ఆవిడకి సహాయం చేయలేదంట వాళ్ళు. దాంతో ఈ విషయంపై నవనీత్ కౌర్ స్పీకర్ కి కంప్లైంట్ చేసిందట. గతంలో హనుమాన్ చాలీసా విషయంలో అరెస్ట్ అయిన సందర్భంలో స్పీకర్ ఓం బిల్లా కు రాసిన లేఖలో తన పడిన బాధనంత చెప్పుకొచ్చింది ఆవిడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: