ఇదీ జగన్ గెలుపు ధీమా.. లెక్కలు కరెక్టేనా?
దీని ద్వారా అత్యంత అసంతృప్తితో ఉన్న వారిని అరడజను సార్లు కలిసినట్లు ఉంటుంది, ఇక సంతృప్తిగా ఉన్న వాళ్ళకి రెండు, మూడు సార్లు గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టుగా ఈ ప్రచార కార్యక్రమం మొదలవుబోతుందని తెలుస్తుంది. గెలుపు తమదే అన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు.
కోటి 60 లక్షల మంది కుటుంబాలు ఉంటే, అందులో కోటి 40 మంది లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటే, అందులో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకం అందింది కాబట్టి, ఈ కోటి నలభై లక్షల మందిలో కోటి రేషన్ కార్డులను లెక్క వేసుకుంటే, కోటి×2 1/2 ఓట్లు వేసుకుంటే 2 1/2 కోట్ల ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి లెక్క. అయితే ఈ పథకాలు అందుకునేవాళ్లలో అన్ని పార్టీల వాళ్లూ ఉన్నారని ఆయనే చెబుతూ ఉంటే అది సాధ్యమా అని అనుకుంటే అందుకే ఇన్ని తీసేశామని, వాళ్ల పార్టీ వాళ్ళే చెప్తారు కోటికే లెక్కేసుకున్నాం 45 లక్షలకు కాదని.
ఇప్పుడు జగన్ కు అసలు సమస్య ఏంటంటే జగన్ ఏం చేస్తున్నా ఏమీ చేయడం లేదని అన్ని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్న వేళ, జనాల చేతికి డబ్బులు అందుతున్నా ఏదో ఒక లోటు, ఏదో ఒక అసంతృప్తి వాళ్ళలో కలుగజేసే వాతావరణాన్ని సృష్టిస్తున్న వేళ జగన్ వాళ్ళందరినీ సంతృప్తి పరచగలరా అనేది ఇప్పుడు ప్రశ్న ?