రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?
రష్యా ఆయిల్ ను బ్యాక్ డోర్ ద్వారా యూరప్ దేశాలు, చైనా, టర్కీ, భారత్ లాంటి కంట్రీల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ రిఫైన్డ్ ఆయిల్ సంస్థలకు ఇలా యూరప్ దేశాలకు అమ్మడం ద్వారా మంచి లాభాలు గడించాయి. కేపీఎల్ఈఆర్ డేటా ప్రకారం.. యూరోపియన్ కొనుగోలు దారులు ప్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్ లాంటి దేశాలే కాకుండా అమెరికా సైతం ఇండియాలో శుద్ధి చేసిన ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఇండియా ఒక్కరోజులో 11 వేల బ్యారెళ్ల నుంచి 12 వేల బ్యారెళ్ల వరకు ఎగుమతి చేసినట్లు పేర్కొంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ఇండియాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. గతంలో భారత్, గల్ప్ దేశాల నుంచి కొనుక్కునేది. వారు ఎంత చెబితే అంత ధర చెల్లించి కొనుగోలు చేసుకునేది. కానీ రష్యాతో మోదీ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తక్కువ ధరలో ఎక్కువ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని శుద్ధి చేసి పాశ్చాత్య దేశాలకు అమ్మి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.
ఇందులో ప్రైవేటు సంస్థల ఆజమాయిషీ కూడా పెరిగిపోయిందని తెలిసి వాటిని తగ్గించేందుకు ప్రభుత్వ సంస్థలే ఎక్కువ ఆయిల్ కొనుగోలు చేసేట్లు మోదీ ప్రత్యేకమైన విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఏదైమైనా ఎవరి పక్షాన నిలబడకుండా కేవలం తటస్థంగా ఉంటూ ఇలా క్రూడ్ ఆయిల్ ను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం అనేది హర్షించదగిన విషయమే.