పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చిన చైనా?

చైనాకు సంబంధించిన వ్యాపారాలు పాక్ లో మూత పడుతున్నాయి. భద్రత వైఫల్యం చూపుతూ వాటిని తగ్గించేసుకుంటుంది. టీటీటీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ చైనా వారిపై దాడులకు దిగుతోంది. ఖైబర్ పంక్తువా వారు కూడా చైనా కు సంబంధించిన వ్యక్తులు, వ్యాపారులపై దాడులకు తెగబడుతోంది. తమ వాళ్ల ప్రాణాలు రక్షించలేని చోట, వ్యాపారాలు కొనసాగించలేమని చెబుతోంది.

ప్రత్యేక భద్రత కల్పిస్తామన్న పాక్ వాటిని నిరూపించలేకపోయింది. తంబ్ ఇంప్రెషన్, ప్రైవేటు సెక్యూరిటీ, తదితర చర్యలు పాక్ ప్రభుత్వం తీసుకున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇస్లామాబాద్ లోని చైనా దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసి వేసింది. పాకిస్థాన్ పంజాబ్ లోని చైనా తమ కార్యాలయానికి తాళం వేసేసింది. సిపెక్ లో తమ కార్యకలాపాలను ఆపేసింది.

చైనా వాళ్లకు పాక్ సొంత సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే అలా పెట్టుకునే వారిపై ఉగ్రవాద సంస్థలు దాడులు చేస్తున్నాయని చైనా మొరపెట్టుకుంటోంది. బెలూచి లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద సంస్థలు చైనా వాళ్లు కనిపిస్తే చాలు చంపేస్తున్నారు. గ్వాదర్ పోర్టు రూట్ లో మాత్రం భయానాకంగా తయారైంది పరిస్థితి. అక్కడ ఎవరైనా చైనా వాళ్లు కనిపిస్తే చాలు చంపి పడేస్తున్నారు. పాక్ స్టాక్ ఎక్చైంజ్ వద్ద 2018 లో జరిగిన బాంబు దాడిలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందని చైనా చెబుతోంది.

చైనా సెక్యూరిటీ కాంట్రాక్టర్లను కూడా చంపేసే అవకాశాలు ఉన్నట్లు ఆరోపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో  తమ పెట్టుబడులు, వ్యాపారాలను పాకిస్థాన్లో తగ్గించుకోవాలని చైనా భావిస్తోంది. తద్వారా అన వ్యాపార సామ్రాజ్యం పాక్ నుంచి తరలిపోతుంది. పాకిస్థాన్ కు ఇన్ని రోజుల నుంచి అండగా నిలిచిన చైనాకు పాక్ లోని అంతర్గత కుమ్ములాటలే కాకుండా ఏకంగా చైనా వ్యక్తులపై దాడులు చేస్తూ వారిని చంపేస్తుున్నారు. పాక్ లో ఏ దేశం వారు వచ్చినా వారి పరిస్థితి ఇలాగే ఉంటుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: