సెలవురోజైనా.. ఈ జగనన్న సందడి తగ్గలేదుగా?

ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఆరోజు సాధారణంగా సర్కారు ఉద్యోగులు రెస్టు తీసుకుంటారు. కానీ.. ఏపీలో ఈ ఆదివారం ఒకటో తారీఖున వచ్చింది. అందుకే ఈ ఆదివారం వాలంటీర్లకు సెలవు లేదు.. వారు తెల్లవారుజాము నుంచే వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం ప్రారభించారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. అప్పటికే 47 లక్షల మందికి రూ.1193.88 కోట్లు పంపిణీ చేశారట. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు  పెన్షన్లు ఇస్తున్నారు.

ఏపీలో ఆదివారం అయినప్పటికీ మే ఒకటిన 60 లక్షల 80 వేల మందికి పెన్షన్ల పంపిణీ జరిగింది.  కొన్ని దూర ప్రాంతాల్లో నగదు తీసుకు వెళ్లడానికి వీలుగా లేని చోట్ల అందక పోవచ్చు. ఆ మాత్రం దానికి తప్పుడు ప్రచారం చేయకూడదు. అలా చేస్తే అనవసరపు ప్రచారాలతో అవ్వ తాతలు ఆందోళన చెందే అవకాశం వుందంటున్నారు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు. ఆదివారం రాత్రి తొమ్మిది, పది వరకూ వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారట.  

మారుమూల ప్రాంతాల్లో నగదు తీసుకువెళ్లలేని వారి వల్ల ఆలస్యం కావచ్చని మంత్రి అన్నారు. పింఛ‌న్ల పంపిణీ ప‌ట్ల ల‌బ్దిదారులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారట. గతంలో పెన్షన్లు చాలా ఆలస్యంగా అందేవి. అది కూడా పెన్షన్ అందుకునే ముసలీ ముతకా అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పెన్షన్ ఇచ్చే రోజు మిస్ అయితే.. మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వచ్చేది. ఆ వచ్చే కాస్త ఫించన్ ఆటో ఖర్చులకు సరిపోయేలా ఉండేది.

కానీ ఇప్పడు మాత్రం ఎక్కడికీ వెళ్లే పని లేదు. ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి పెన్షన్ మొత్తం చేతిలో పెట్టి వెళ్లిపోతున్నారు. ఇలా ఒకటో తారీఖు జీతాలు ఉద్యోుగులకే వస్తుంటాయి. కానీ.. ఏపీలో ఉద్యోగులకు వచ్చినా రాకపోయినా వృద్ధుల, ఇతర రంగాల ఫించన్లు మాత్రం ఆగవంటున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: