ఉక్రెయిన్‌ యుద్ధం: ప్రపంచదేశాలకు ఇండియా వార్నింగ్‌?

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఇండియా అనుసరిస్తున్న విధానంపై కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఇండియా తీరును అమెరికా సహా అనేక దేశాలు తప్పుబడుతున్నాయి. ఇండియా రష్యాకు మద్దతుగా ఉందన్న వాదన బాగా వినిపిస్తోంది. అయితే.. తాము ఎంచుకున్న మార్గానికి.. ఏ దేశం ఆమోదం అవసరం లేదని ఇండియా మరోసారి అంతర్జాతీయంగా తేల్చి చెప్పింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ వేదికపై మరోసారి స్పష్టం చేశారు.


ఈ విషయంలో తమ మార్గం తమదేనని స్పష్టం చేశారు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు.. ప్రపంచదేశాలను భారత్ సంతోష పెట్టలేదని దిల్లీలో జరుగుతున్నఓ సదస్సులో ఆయన చెప్పారు.  రైసీనా అంతర్జాతీయ సదస్సు పేరిజ  జరుగుతున్న భేటీలో ఆయన ప్రసంగించారు. ఇతర దేశాలు తమకు దిశానిర్దేశం చేయడం, ఇంకొకరి ఆమోదం కోసం ఇండియా ఎదురు చూసే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని జై శంకర్ అన్నారు.


ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన తరుణంలో ఇక ముందు విదేశాల కోసం ఆలోచించే  పద్ధతికి స్వస్థి పలకాలని జై శంకర్ అన్నారు. అలాగే క్రెయిన్  సంక్షోభం యూరప్‌కు గొప్ప మేలుకొలుపు కావాలని జైశంకర్ కామెంట్ చేశారు. ఏదేశమైనా తమ ప్రాధాన్యాల మేరకు  వ్యవహరించడం సర్వ సాధారణమని జై శంకర్ కామెంట్ చేశారు. గత పదేళ్ల నుంచి ఆసియాలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని యూరప్‌ దేశాలకు జైశంకర్ సూచించడం ద్వారా సెటైర్లు పేల్చారు.  ఉక్రెయిన్ పై సైనిక చర్య విషయంలో భారత్  వైఖరిని పాశ్చాత్య దేశాలు కొన్నాళ్లుగా తప్పుపడుతున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


జై శంకర్ తాజా వ్యాఖ్యలు ఇండియాకు గర్వ కారణం అని చెప్పాలి.. అమెరికా, చైనా, రష్యా వంటి పెద్దన్నల మెప్పు కోసం పని చేసే పరిస్థితులు ఇండియాకు చెల్లిపోయాయి. ఇండియా తన దేశానికి ఏది శ్రేయస్కరమో అదే ఎంచుకునే రోజులు వచ్చేశాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన రోజు వచ్చింది. అందుకే ఇండియా వైఖరిని తప్పుబడుతున్నా.. మన ఇండియాతో సంబంధాలు మాత్రం మెయింటైన్ చేస్తున్నాయి అగ్ర దేశాలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: