కేసీఆర్‌ Vs ఈటల: ఆ ఎన్నికల్లో ఈటలకు షాక్‌ తప్పదా..?

ఆడు మగాడ్రా బుజ్జీ.. అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్‌ ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు బాగా నప్పుతుంది.. అధికార పార్టీకి ఎదురెళ్లి.. సీఎం కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజాన్ని ఢీకొని.. అంగ బలం, అర్థబలం పుష్కలంగా ఉన్నా.. ఎన్నో వ్యూహాలు పన్నినా.. అన్నింటినీ ఎదిరించి మరీ విజయం సాధించాడు ఈటల రాజేందర్.. కేసీఆర్ పన్నిన వ్యూహాలకు, వేసిన ఎత్తుగడలకు దాదాపు 24 వేల పైచిలుకు మెజారిటీ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

అయితే.. ఈ విజయంతో ఈటల సాధించేదేముంది.. అందులోనూ కేవలం రెండేళ్ల పాటే ఉండే ఎమ్మెల్యే పదవితో ఈటల సాధించేదేముంది అని కొందరు ప్రశ్నించొచ్చు. కానీ.. ఇప్పుడు గెలవకపోతే.. ఇక ఈటలకు రాజకీయ భవితవ్యమే ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే ఈటల రాజేందర్‌ అంతగా తెగించి కొట్లాడాడు. అంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఈటల రాజేందర్‌ ఓ పొలిటికల్ హీరో. కేసీఆర్ వంటి వాడిని ఎదిరించి మరీ నిలిచిన నాయకుడు.

కానీ.. ఇదే ఈటల రాజేందర్‌కు వచ్చే జనరల్ ఎన్నికల్లో విజయం అంత సులభంగా దక్కే అవకాశాలు కనిపించవు. బై ఎలక్షన్ కాబట్టి.. ముందు శక్తివంతుడైనా కేసీఆర్‌కు చెక్ పెట్టాలి కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ ఈ హుజూరాబాద్ ఉపఎన్నికను కాస్త లైట్‌గా తీసుకుంది. రేవంత్ రెడ్డి కావాలనే ఈటలకు సహకరించాడన్న వాదన కూడా ఉంది. ఉమ్మడి శత్రువు ను మట్టి కరిపించడానికి రేవంత్ రెడ్డి ఈటలకు సహకరించి ఉండొచ్చు కూడా. అయితే ఈటలకు ఈ వెసులు బాటు ఈ ఎన్నిక వరకు మాత్రమే ఉంటుంది.

ఇదే ఈటల వచ్చే జనరల్ ఎన్నికల్లో గెలుపొందాలంటే.. చెమటోడ్చాల్సి ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు. అప్పుడు అన్ని పార్టీలు చెమటోడ్చి పోరాడతాయి. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలుతుంది. అందుకే ఇప్పుడు గెలిచినా.. ఈటల రాజేందర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాత్రం అంత సులభం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: