75వ పంద్రాగ‌స్టు : ఎ డ్రీమ్ బిగ్గ‌ర్ దేన్ యూ

RATNA KISHORE
దేశీయ విజ్ఞానంతో కూడిన క‌ల
దేశీయ సంస్కృతిని కాపాడేందుకు
రాసుకున్న క‌ల
లేదా అక్ష‌ర మాల
క‌లాం ను న‌డిపించింది

 


ఈ దేశంలో పెద్ద క‌లకు అదొక్క‌టే ప్రామాణికం
సాధ‌న అన్న‌ది మ‌న‌కు లేదు
ఏం లేదు మ‌న నాయ‌కుల‌కు ఏటా ఒక్క‌సారే
త‌మ త‌మ బాధ్య‌త‌లు గుర్తుకువ‌స్తాయి త‌రువాత పోతాయి


నిన్ను మించిన కల దేశాన్ని దాటి పోయిన కల
ప్ర‌పంచం నివ్వెర పోయిన క‌ల ఈ యువ‌కులకు కావాలి
ద‌య  ఉంచి దేవుడా మా ప్రార్థ‌న‌లు మ‌న్నించు



తిండి గింజ‌ల కోసం ఉపాధి కోసం దేశం క‌ల‌లు కంటుంద‌ని రాయ‌డం అవ‌మానం అవుతుంది.కానీ రాయ‌కుండా ఉండ‌డం నిర్ల‌క్ష్యాలకు సంకేతం అవుతుంది. దేశంలో పాల‌కు ల‌ను మ‌నం నిల‌దీయ‌లేని స్థితిలో ఉన్న‌ప్పుడు ఈ ద‌శాబ్ద ఆరంభ విషాదం లాక్ డౌన్ రూపంలో మ‌న‌ల్ని పీడించిన‌ప్పుడు మ‌న క‌ల‌లు తిండి గింజ‌లు మిగుల్చుకో వ‌డం త‌ ప్ప ఏమౌతాయి. దేశంలో గుడిసెలు లేని ప‌ట్ట‌ణాలు న‌గ‌రాలు ఉండాలి అని ఎన్ని ఏళ్ల నుంచి క‌ల‌లు కంటున్నారు. మురికి లేని స‌మాజం కావాలి అని ఎన్ని ఏళ్ల నుంచి క‌ల‌ లు కంటున్నారు. ఇవ‌న్నీ కాగితాల‌కు ప‌రిమితం అయిపోయి నిధులు రాజ‌కీయ నాయ‌కుల జేబుల్లోకి పోతున్న‌ప్పుడు మ‌న పార్లమెంట్ స్టాండింగ్ క‌మిటీల ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సుల గురించి ఏం రాయాలి ఏం చెప్పాలి ?
ఏ దేశాన్న‌యినా న‌డిపించేవి కొన్ని క‌ల‌లే!అస‌లు భ‌విష్య‌త్ ఎలా ఉండబోతోంది అన్న‌ది ఒక క‌ల సాకారంతోనే సాధ్యం అయి తీరు తుంది.కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చుపెడుతూ బం గారు తెలంగాణ, హ‌రితాంధ్ర అంటూ ఎన్ని ప‌థ‌కాలు తెచ్చినా ఇవి సామాన్యుల క‌ల‌లా? లేదా అవి నెర‌వేర‌క మ‌నల్ని వెక్కిరింత‌ల‌కు గురి చేస్తున్నాయా అన్న‌ది ప్ర‌శ్న. బీద‌ లంతా తిండికి లేక అల్ల‌ల్లాడుతున్న‌ ప్పుడు స‌రైన పోష‌కాహారం అందుకోవ‌డ‌మే గ‌గ‌నం అవుతున్న‌ప్పుడు అంత‌కు మించి సాధించే క‌ల‌లు ఏముంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: