హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల వైఖరిపై ఎప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న గోల ఇప్పటికి సుప్రింకోర్టుకు అర్ధమైనట్లుంది. రాజ్యాంగ సంక్షోభం(రాజ్యాంగ విచ్చిత్తి) తలెత్తిందన్న హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ కామెంట్లను సుప్రింకోర్టు చాలా తీవ్రంగా పరిగణిచింది. ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు చీప్ జస్టిస్ +ఆరుగురు జడ్జీలు ప్రభుత్వ వ్యతిరక వైఖరి అవలంభిస్తున్నట్లు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకి లేఖరూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు నుండే కొందరు జడ్జీలు చేస్తున్న వ్యాఖ్యలు, తీర్పులపై ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా హైకోర్టు ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు పోలీసుల పనితీరు తదితరాలపై టీడీపీ మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగ విచ్చిత్తనే పెద్ద పెద్ద పదాలను వాడేశారు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా రాష్ట్రంలో అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని ప్రభుత్వం అడిగినా జస్టిస్ కుదరదన్నారు. దాంతో ఇదే విషయమై ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేపై హైకోర్టు జడ్జిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంక్షోభం లాంటి పదాలు వాడటాన్ని తప్పుపట్టారు. అసలు రాజ్యాంగ సంక్షోభం వచ్చిందనే కామెంట్లు వాడేటపుడు అటువంటి పరిస్దితులున్నాయా అనే విషయం ఆలోచించినట్లు లేదన్నారు. సరే మొత్తానికి బాబ్డే హైకోర్టు జడ్జి చేసిన కామెంట్లపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
మొత్తానికి ఎప్పటినుండో జగన్ చేస్తున్న గోల ఇంతకాలానికి సుప్రింకోర్టు దృష్టిలో పడినట్లుంది. ప్రభుత్వం తరపున కొన్ని అంశాల్లో తప్పులు జరిగినమాట వాస్తవమే. ప్రభుత్వం తప్పులు చేసినపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పటంలో అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కోర్టులో సవాలు చేయిస్తున్నాయి. కేసులు తీసుకోవటం, వెంటనే విచారణకు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేయటం, తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం హైకోర్టులోని కొందరు జడ్జీలకు మామూలైపోయింది. మొత్తానికి జగన్ బాధ ఇప్పటికి సుప్రింకోర్టుకు అర్ధమైనట్లుంది.