దేశం కోసం ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ సాహస యాత్ర?
నూటికి నూరు శాతం సౌర శక్తిని వాడినప్పుడే ఈ దుష్ఫరిణామాలు అంతమతాయని భావిస్తున్న సోలంకి.. ఆ దిశగా జనంలో చైతన్యం నింపాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి పదేళ్లు సెలవు పెట్టి.. ఎనర్జీ స్వరాజ్ యాత్ర ప్రారంభించారు. ఓ బస్సులో దేశమంతా ప్రయాణిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నారు. సోలంకి చేపట్టి ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్ర.. పదేళ్ల పాటు సాగనుంది. సౌరశక్తి పై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం.. ప్రతి ఇంటిలో సౌరశక్తిని ఉపయోగించేలా ప్రేరేపిచడం ఆయన యాత్ర లక్ష్యాలు. ఈ యాత్ర కోసం సోలంకి స్వయంగా ఓ సౌర బస్సును తయారు చేసుకున్నారు.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో సుదీర్ఘ యాత్రకు సంకల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రయాణించడం.. దారిలో ప్రజలు, విద్యార్థులకు సౌరశక్తి పై అవగాహన కల్పించడం.. చేస్తున్నారు. ఈ పదేళ్ల యాత్రలో ఎప్పుడు ఎక్కడకి చేరుకోవాలి.. ఎక్కడ బస చేయాలి అనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. యాత్రకు అవసరమైన అన్ని వసతులు బస్సులోనే సమకూర్చుకున్నారు.
చైతన్య సింగ్ సోలంకి.. గతంలో మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ సోలార్ విలేజ్ గా తీర్చిదిద్దారు. అందుకు ప్రధానమంత్రి ఆవిష్కరణ అవార్డు అందుకున్నారు. సౌర విద్యుత్ రంగంలో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా స్థాపించారు. ఇప్పటి వరకూ 28 వరకూ సైన్స్ అవార్డులు అందుకున్నారు. ఈ భూమిని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలని సోలంకి సూచిస్తున్నారు.