పుష్పలో కేశవ పాత్ర కోసం.. సుకుమార్ ముందుగా ఆ హీరో ని అనుకున్నాడట తెలుసా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన పాత్ర మరొకరి దగ్గరకు వెళ్లడం చూస్తూ ఉంటాం. ఇలా ఒక హీరో చేయాల్సిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్లు కొట్టడం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక హీరోలు ఫ్లాపులు చవిచూడడం కూడా జరుగుతూ ఉంటుంది  అయితే అప్పుడప్పుడు ఇక ఇలాంటి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పుష్ప లోని ఒక పాత్రకు సంబంధించిన వార్త ఇలాగే వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో  సినిమాలు వచ్చిన ఇక పుష్ప సినిమా మాత్రం నయా ట్రెండును సృష్టించింది. ఇక అల్లు అర్జున్ ను పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ను చేసింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్పా సినిమాలో అల్లు అర్జున్ పాత్రతో పాటు మొదటి నుంచి చివరి వరకు  సాగే పాత్ర కేశవ పాత్ర.

 కేశవ పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి నటించి అదరగొట్టారు. ఇక ఈ పాత్రలో ఒదిగిపోయారు. తన యాత్రతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అయితే టాలీవుడ్ లెక్కలు మాస్టారుగా పిలుచుకునే సుకుమార్ మాత్రం  కేశవ పాత్ర కోసం ముందుగా జగదీష్ ను అనుకోలేదట. ఇటీవల ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. హీరో సుహాస్ అంటే తనకు అల్లు అర్జున్ కు చాలా ఇష్టమని వెల్లడించాడు డైరెక్టర్ సుకుమార్. ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పుష్ప సినిమాలో కేశవ రోల్ కోసం సుహాస్ ని అనుకున్నాం. కానీ హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్ర కోసం తీసుకోవడం బాగోదు అనిపించింది. అందుకే అడగలేదు. నాచురల్ స్టార్ నాని లా సుహాస్ అద్భుతంగా నటిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించాడు సుకుమార్. కాగా అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: