"కల్కి" రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్..?

Pulgam Srinivas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 ఏడి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి దీపిక పదుకొనె , దిశ పటని హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి మూవీ లతో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఇక ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ మరో ఒకటి , రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , నాగ్ అశ్విన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , అమితా బచ్చన్ , కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా అది కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: