తెలంగాణ కాంగ్రెస్‌లో జూన్‌ తర్వాత పెను మార్పులు?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్‌లో జూన్‌ తర్వాత పెను మార్పులు ఖాయమంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా. తెలంగాణలో అవినీతి చేస్తున్న వారంతా జూన్ మొదటి వారం తర్వాత సర్దుకోవాల్సిందేనిని అమిత్‌ షా స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రిఅమిత్‌షా ఆరోపించారు.

ఫేక్‌ వీడియోలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్క్యులేట్‌ చేశారని తప్పుబట్టిన ఆమిత్‌ షా...... అలాచేస్తే దిల్లీ పోలీసులు రాకుండా ఎలాఉంటారని ప్రశ్నించారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించిన అమిత్‌ షా... ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి BC, SC, STలకి పెంచుతామన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా హామీఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవడమే బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోందని అమిత్‌ షా అంటున్నారు.

విస్తృతంగా ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నేతలు ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తుందంటూ  తనమాటలను వక్రీకరించి ఫేక్‌ వీడియోని కాంగ్రెస్‌ సర్క్యులేట్‌ చేసిందని అమిత్‌ షా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఆ వీడియోను సర్క్యులేట్‌ చేశారని ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ బహిరంగ సభలో అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎటిపరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అమిత్‌ షా...ఫేక్‌ వీడియోలు సర్క్యూలేట్‌ చేస్తే దిల్లీ పోలీసులు రాకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కొద్దిప్రాంతం మినహా దేశవ్యాప్తంగా నక్సలిజంను తుదముట్టించామని అమిత్‌ షా పేర్కొన్నారు. ముస్లింల ఓట్లకోసం ఉగ్రవాదులపై మన్మోహన్‌ సర్కారు కఠిన చర్యలు తీసుకోలేదని అమిత్‌ షా ఆరోపించారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపిన అమిత్‌ షా మూతబడిన చక్కెర పరిశ్రమలను తెరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవాలంటే... ఏడాదికి ఒకరిని ప్రధానిని చేస్తామంటున్న ఇండియా కూటమి వల్ల సాధ్యమవుతుందా అని అమిత్‌ షా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: