ప్రపంచానికే పెనుముప్పుగా మారుతున్న హౌతీ తీవ్రవాదులు?

Chakravarthi Kalyan
పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులకు ఆపాలంటూ యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఎర్ర సముద్రం మీదుగా భారత్ కి వస్తున్న ఆండ్రోమెడా స్టార్ నౌకపైన హౌతీలు మిస్సైల్స్ తో దాడి చేశారు. ఈ నౌకపైకి హౌతీలు మూడు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడి వల్ల  నౌకకు స్వల్ప నష్టం వాటిల్లింది.

మరో నౌక ఎంవీ మైషాపైనా హౌతీలు మిస్సైళ్లతో ఎటాక్ చేశారని.. దానికి కూడా నష్టం వాటిల్ల లేదని తెలిసింది. ఈ వివరాలను అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. అండ్రోమెడా స్టార్ నౌక వాస్తవానికి బ్రిటన్ దేశానికి చెందినది. అయితే ఇటీవల దీన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఓ కంపెనీకి విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని రష్యా, భారత్ మధ్య వాణిజ్య సేవల కోసం వాడుతున్నారు. చమురు నిల్వలతో కూడిన ఈ నౌక రష్యాలోని ప్రిమోర్క్స్ నగరం భారత్ లోని గుజరాత్ లో ఉన్న వదినార్ పట్టణానికి వస్తున్నట్లు గుర్తించారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము కూడా ఎర్ర సముద్రంలో దాడులను ఆపుతామని హౌతీ ప్రతినిధి యహ్యా సరియా స్పష్టం చేశారు. పనామా జెండాతో ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న ఓ నౌకపై కూడా దాడి చేసినట్లు వెల్లడించారు. మరిన్ని దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఎర్ర సముద్రంపై రక్షణగా అమెరికా, బ్రిటన్ లు రక్షణగా తమ బలగాలను మోహరించినా  ఆ తర్వాత తప్పుకున్నాయి. అప్పుడప్పుడు హౌతీల మిస్సైల్స్ ని తిప్పి కొడుతూ మమ అనిపిస్తున్నారు. కానీ హౌతీ తీవ్రవాదులు మాత్రం తమ దాడులను ఆపడం లేదు.  దీని మూలంగా అమెరికా, బ్రిటన్ ను తమ వ్యాపారాలను యాభై శాతం వరకు వదులుకున్నాయని.. ఇది తమ విజయమని గర్వంగా చెబుతున్నారు. ఓ ఉగ్రవాది అగ్రరాజ్యాలకు ఇలా బహిరంగంగా తాము విజయం సాధించామని చెప్పడం చూస్తుంటే ఆయా దేశాలతో పాటు ప్రపంచ దేశాలు తలదించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: