వైసీపీ వలస నేతలతో బాబు రాజకీయం ఫలిస్తుందా?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికలకు నలభై రోజుల సమయం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ సమయం చాలా కీలకం. ఇప్పుడు జనంలో ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చడం అసాధ్యం. ఏ భారీ సంఘటనో ఏ ఎమోషనల్ ఫీల్ ఇచ్చే అంశాలు చోటు చేసుకుంటే తప్ప పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఓటరు తీర్పులో ఉండవు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆలోచనలు ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు సైతం అర్థం కావు. దశాబ్ధాలుగా పార్టీ అధికారంలో ఉంది. ఈ సమయంలో పార్టీ బలహీనంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో చోట అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అక్కడ స్థానిక నేతలను ప్రోత్సహించి.. అక్కడ పార్టీని బలోపేతం చేయాలి. ఒక్కసారి  ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా అక్కడి ప్రజలు పార్టీని గెలిపిస్తారు.

అయితే 20 ఏళ్లు అధికారంలో ఉండి.. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు అలాంటి బలమైన నాయకుల్ని  ఇంకా తయారు చేసుకోలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పయ్యావులు కేశవ్, ధూళిపాల్ల నరేంద్ర, ఆళ్లపాటి రాజా, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుచ్చయ్యచౌదరి, అయ్యాన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు. కానీ వీరిలో కొంతమంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే.. వారికి ఆయా నియోజవర్గాల్లో స్వేచ్ఛనివ్వకపోవడం. ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం కల్పించడం అంటే ఇతర పార్టీ నాయకుల్ని టీడీపీ లో చేర్పించుకొని వారికి సీట్లు ఇవ్వడం లాంటివి చంద్రబాబు చేస్తుంటారు. అంటే అప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఉన్న వారు పోటీకి పనికి రారా.. అలాంటప్పుడు మరో బలమైన నాయకుడిని తయారు చేయాలి కదా.. ఇలాంటివి ఏమీ చేయకుండా ఇప్పుడు ఇతర పార్టీ నాయకుల్ని చేర్చుకొని ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: