వయనాడ్ ప్రళయం : వందల మందిని కాపాడిన రామచిలుక?

frame వయనాడ్ ప్రళయం : వందల మందిని కాపాడిన రామచిలుక?

praveen
ప్రకృతికి కోపం వస్తే తట్టుకోవడం ఎవరి తరము కాదు. అంతా బాగున్నప్పుడు ఏకంగా ప్రకృతికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే మనిషి.. ఇకఅదే ప్రకృతికి కోపం వస్తే మాత్రం ఎన్నో ప్రయాయాలతో వణికిపోతూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేరళలోని వయనాడులో కూడా ఇలాంటి ఒక ఘటనే  జరిగింది. ఏకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక భారీ వర్షాలు నేపథ్యంలో ఎన్నో ప్రాంతాలు వరదలతో ముంచెత్తుతూ ఉన్నాయి. దీంతో జనావాసాలు స్తంభించిపోతూ ఉన్నాయి. అయితే వయనాడ్ లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఏకంగా ఒక గ్రామంలోని ఇల్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అని చెప్పాలి. ఇక ఈ ఘటనలో ఏకంగా వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఈ విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం వయనాడులో విపత్తుకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక అక్కడ బాధితులు అందరికీ కూడా ఎంతోమంది విరాళాలు ప్రకటిస్తూ ఉండడం చూస్తున్నాం. సినీ రాజకీయ ప్రముఖులు భారీగా విధానాలు ఇస్తున్నారు.

 అయితే వయానాడ్ లో జరిగిన ప్రకృతి ప్రకోపం తర్వాత ఇప్పుడు ఒక ఆసక్తి విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని రక్షించిందట. ప్రమాదానికి ముందు రోజు వినోద్ అనే వ్యక్తి తన చిలుకతో వయనాడ్ లో ఉన్న సోదరి ఇంటికి వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ చిలుక బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని  నోటితో పొడుస్తూ ప్రకృతి విపత్తుపై హెచ్చరించిందట. దీంతో తన పెంపుడు చిలుక చెబుతున్న విషయాన్ని ముందే అర్థం చేసుకున్న వినోద్.. ఇక పొరుగు వారిని అలర్ట్ చేసి అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. ఇలా ఒక రామచిలుక ఏకంగా వందల మంది ప్రాణాలను కాపాడింది. కాగా మూగజీవాలకు ప్రకృతి విపత్తులను కనిపెట్టే గుణం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: