ఓరినాయనో.. ఇంత చిన్న కారణానికి.. ఎవరైనా హత్య చేస్తారా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయిందేమో  అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. కుదిరితే సహాయం కూడా చేసేవాడు. కానీ ఇప్పుడు సహాయం చేయడం గురించి దేవుడెరుగు ఏకంగా సాటి మనిషి ప్రాణాలను తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు మనుషులు. చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

అయితే ఇలాంటి ఘటన గురించి తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా మనిషిని చంపేస్తారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఇక బయటికి వెళ్లినప్పుడు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాక అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ప్రతి మనిషికి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటిదే గగుర్పాటుకు గురి చేసే ఘటన జరిగింది. సాధారణంగా ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు పొరపాటున కొన్ని కొన్ని సార్లు ఎదుటి వ్యక్తులకు భుజం తగలడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భుజం తగలడమే ఒక దారుణమైన హత్యకు కారణమైంది.

 హైదరాబాద్లోని బేగంపేటలో ఈ దారుణమైన ఘటన జరిగింది. తరుణ్ అనే 18 ఏళ్ల యువకుడు ఇటీవల రాత్రి 10 గంటలకు పాన్ షాప్ కు వెళ్ళాడు. అయితే అక్కడే ఉన్న 21 ఏళ్ళ సాయికిరణ్ భుజం తరుణ్ కు తగిలి వాగ్వాదం మొదలైంది. అయితే సాయికిరణ్ ముగ్గురు రూమ్ మేట్స్ శివశంకర్, ఎ. తరుణ్, పండు లను  తీసుకువచ్చి తరుణ్ తో గొడవ పడ్డారు. వచ్చే సమయంలో తమతో పాటు తీసుకు వచ్చిన కత్తితో తరుణ్ పై దాడి చేశారు. ఇలా దాడి చేసే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే గమనించిన తరుణ్ తల్లి అతని ఆసుపత్రికి తరలించి లోపే చివరికి ప్రాణాలు పోయాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: