బాత్రూం వాడుకోవచ్చా అని అడిగి.. డెలివరీ బాయ్ ఎంతకు తెగించాడు?

praveen
నేటి సభ్య సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే.. మనుషుల తీరు ఎంత దారుణంగా మారిపోతుందో అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా నేటి సభ్య సమాజంలో మనుషుల కంటే మానవ మృగాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఏకంగా మహిళలు ఒంటరిగా కనిపించారు అంటే చాలు కామంతో ఊగిపోతూ దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వెరసి మహిళలు రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

 అయితే ఇలా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. కొంతమంది అయితే ఏకంగా మంచి వాళ్ళలా ముసుగు వేసుకొని సమయం సందర్భం చూసి ఇక లోపల ఉన్న మృగాన్ని బయటకు తెచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే చెప్పాలి. బెంగళూరు బ్రూక్ ఫీల్డ్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లోని మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిపోయింది.

 ఆన్లైన్లో ఓ మహిళ తనకు కావలసిన వస్తువు ఏదో ఆర్డర్ చేసింది. అయితే ఆ పార్సెల్ పట్టుకొని డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే ఆ డెలివరీ బాయ్ కామందుడు అన్న విషయాన్ని మాత్రం ఆ మహిళ గమనించలేకపోయింది. బయట ఎండలు ఉండడంతో పాపం అంటూ ఆ డెలివరీ బాయ్ కి తాగేందుకు నీరు ఇచ్చింది. అయితే మొదట ఆ డెలివరీ బాయ్ నీళ్లు తాగి వెళ్లిపోయాడు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి మీ బాత్రూం వాడుకోవచ్చా అని అడిగాడు. ఇక సదరు మహిళా సరే అని అతన్ని లోపలికి రాణించింది. అయితే బాత్రూంలో నుంచి బయటికి వచ్చిన ఆ కామందుడు చివరికి కిచెన్ లో ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరానికి చోట తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కానీ ఆమె ఎదురుదాడికి దిగడంతో చివరికి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: