తల్లి కాబోతున్న కీర్తి సురేష్.!

Pandrala Sravanthi
దక్షిణాది బ్యూటీ కీర్తి సురేష్ ఫైనల్ గా తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా లో ఓ టాక్ వినిపిస్తోంది.. కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ 12న తన 15 ఏళ్ల ప్రేమ బంధానికి ఎండ్ కార్డు పెట్టేసి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. అలా కీర్తి సురేష్ తన చిన్ననాటి మిత్రుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ ని గత ఏడాది డిసెంబర్ 12న పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లయ్యాక కీర్తి సురేష్ సినీ కెరీర్ అంత బాలేదని చెప్పుకోవచ్చు. ఈమె పెళ్లయ్యాక విడుదలైన బాలీవుడ్ మూవీ అట్టర్ ప్లాఫ్ అయింది. ఇక ఆ బాలీవుడ్ మూవీలో కీర్తి సురేష్ కాస్త ఎక్స్పోజింగ్ ఎక్కువగానే చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 


ఆ తర్వాత వచ్చిన రివాల్వర్ రీటా సినిమా టాక్ కూడా అంత బాలేదు. అయితే అలాంటి కీర్తి సురేష్ తాజాగా తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా లో పుకార్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ సన్నిహితులు, కీర్తి సురేష్ తల్లి కాబోతుంది అనే విషయాన్ని మీడియా కి లీక్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చాలామంది నెటిజన్స్ మాత్రం నిజంగానే కీర్తి సురేష్ ప్రేగ్నంటా అని ఆసక్తిగా ఎదురు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంకొంత మంది మాత్రం ఈ మధ్యనే రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ కనిపించింది.


అప్పుడు ప్రెగ్నెంట్ అన్న సూచనలేమి ఆమె బాడీ లో కనిపించలేదు. బేబీ బంప్ కూడా కనిపించలేదు అంటున్నారు. మరి సోషల్ మీడియా లో కీర్తి సురేష్ తల్లీ కాబోతుంది అనే వార్తలు వస్తున్నవి రూమర్సేనా లేక నిజంగానే తల్లి కాబోతుందా అనేది కీర్తి సురేష్  క్లారిటీ ఇస్తే గానీ తెలియదు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: