బిగ్ బాస్ 9: ప్రైజ్ మనీ ఎంతో చెప్పినా నాగార్జున.. ఎన్ని లక్షలంటే.. ?
ప్రస్తుతం హౌస్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. (తనూజ, సంజనా, డిమాన్ పవన్, భరణి, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్) ఉన్నారు. అయితే ఇందులో ఈరోజు మరొకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ రోజున ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రోమోలో బిగ్ బాస్ విజేతలకు అందించే ప్రైజ్ మనీని కూడా నాగార్జున అధికారికంగా రివీల్ చేసినట్లు తెలుస్తోంది. గత సీజన్లో మాదిరి ఈసారి కూడా రూ .50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీని అందించబోతున్నట్లు ప్రకటించారు.
అయితే రన్నర్ తో పాటు ఇతర టాప్ 5 కంటెంట్స్ కి ఎంతేంత అమౌంట్ ఇస్తారనే విషయంపై మాత్రం నాగార్జున చెప్పలేదు. అయితే విజేతకు ఎంత ప్రైజ్ మనీ వచ్చినా టాక్స్ ల రూపంలో భారీగానే కట్ అవుతుంది. విజేతకు ప్రైజ్ మనీ తో పాటుగా పలు రకాల కంపెనీలు స్పాన్సర్ కింద నగదు లేదా లగ్జరీ కార్లు, గోల్డ్ చైన్ తదితరు వాటిని టైటిల్ విన్నర్స్ కి వస్తాయని చెప్పవచ్చు. అలా ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన తర్వాత నాగార్జున భరణిని ఈ ప్రైజ్ మనీ నీకు వస్తే.. హౌస్ నుంచి ఎవరిని బయటికి పంపిస్తావ్ ఎవరెవరికి ఎంత ఇస్తావని అడగగా?.. అందుకు భరణి మాట్లాడుతూ మనీ ఇవ్వాలి అనుకుంటే మొదట గుర్తుకు వచ్చేది డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్ .. 20 లక్షల రూపాయల వరకు ఇస్తానని చెప్పారు. పవన్ ను అదే ప్రశ్న అడగక రీతూకి రూ.5 లక్షల పెట్టి గిఫ్ట్ కొనిస్తానని చెప్పారు డిమాన్ పవన్.