పావు బాజీ వల్ల.. పోయిన ఐఫోన్ దొరికింది?

praveen
ఇటీవల కాలంలో అటు మార్కెట్లోకి అధునాతన ఫీచర్స్ తో కూడిన ఎన్నో మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అన్ని కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించే తమ సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా కొత్త కొత్త మొబైల్ మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకువస్తూ ఉన్నాయి. ఇక అతి తక్కువ ధరలోనే ఇక ఇలాంటి మొబైల్స్ అందిస్తూ ఉండడం గమనార్హం. అయితే మార్కెట్లోకి ఎన్ని కంపెనీలకు చెందిన మొబైల్స్ వచ్చిన.. అటు యాపిల్ కంపెనీ తయారు చేసి ఐఫోన్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మార్కెట్లో దొరికే మిగతా మొబైల్స్ తో పోల్చి చూస్తే ఐఫోన్ల ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

 ఒక రకంగా చెప్పాలి అంటే ఐఫోన్ ధర సామాన్యులకు అస్సలు అందుబాటులో ఉండదు అని చెప్పాలి. కానీ ఇక అందరూ ఐఫోన్ కొనుగోలు చేయాలని తెగ ఆశ పడుతూ ఉంటారు. ఐఫోన్ తమ దగ్గర ఉంది అంటే చాలు అదొక పెద్ద స్టేటస్ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో ఇష్టంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఐఫోన్ పోయిందంటే అందరి గుండె పగిలినంత పని అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫోను ఎలాగోలా ట్రాక్ చేసి ఎక్కడ ఉందో కనుక్కోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐఫోన్ పోయింది.

 దీంతో అతను ఆందోళనలో మునిగిపోయాడు. కానీ పావు బాజీ కారణంగా మళ్ళీ పోయిన ఐఫోన్ దొరికింది అని చెప్పాలి. గోవా టూర్ లో ఒక వ్యక్తికి ఎదురైన విచిత్రమైన ఘటనను అతను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మధ్యం మత్తులో ఒక వ్యక్తి నా ఫోన్ దొంగిలించాడు. ఆ దొంగకి ఆకలి అవడంతో ఒక పావు బాజీ దుకాణానికి వెళ్లి తిన్నాడు. అయితే డబ్బులు లేకపోవడంతో దొంగలించిన ఐఫోన్ ను ఆ షాప్ ఓనర్ కి అమ్మేశాడు. ఇక 36 గంటల తర్వాత ఫోన్ ఆన్ కావడంతో ఇక వెంటనే ఫోన్ పోగొట్టుకున్న కస్టమర్ ఆ ఫోన్ కి కాల్ చేసి అది మా ఫోన్ అని చెప్పడంతో చివరికి ఆ హోటల్ ఓనర్ ఆ ఫోన్ ని అతనికి తిరిగి ఇచ్చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: