అతనొక రెజ్లర్.. కండలు తిరిగిన దేహం.. కానీ ఎలా చనిపోయాడో తెలుసా?

praveen
కరోనా కాలంలో ప్రపంచ దేశాలు ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువైపు నుంచి వచ్చి కరోనా పంజా విసురుతుందో ఏ క్షణాన ప్రాణాలు పోతాయో అని అందరూ భయపడిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా గడ్డు పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం లభించింది అని అందరూ ఊపిరి పీల్చుకున్న సమయంలో సడన్ హార్ట్ ఎటాక్లు అందరి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవ్వరిని కూడా ఈ సడన్ హార్ట్ ఎటాక్ లు వదలడం లేదు.

 ఎలా వస్తున్నాయి.. ఎందుకు వస్తున్నాయి అన్న విషయం కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. వెరసి ఇక చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అప్పటివరకు ఎంతో సంతోషంగా గడిపిన వారు సైతం ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోయి చివరికి ప్రాణం కోల్పోతున్నారు. కనీసం ఆసుపత్రికి తరలించి రక్షించేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇక ఇటీవల ఇలాంటి సడన్ హార్ట్ ఎటాక్ కే బలయ్యాడు ఒక రెజ్లర్. జపాన్ స్టార్ రెజ్లర్ అయిన యోటకా యోషి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఈవెంట్లో పాల్గొన్నారు ఈ రెజ్లర్. అయితే ప్రత్యర్థి హుకుటో ఒమొరీ చేతిలో ఓటమిపాలు అయ్యాడు.

 మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన యోషి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే పక్కనే ఉన్నవారు ఏం జరిగిందో అని కంగారు పడిపోయారు. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు  అయితే ఇక ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అయితే అతని మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై మాత్రం జపాన్ ప్రో రెజ్లింగ్ ఎక్కడ అసలు విషయాలను వెల్లడించలేదు. కానీ సడన్ హార్ట్ ఎటాక్ కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడు అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: