అయ్యో దేవుడా.. ఆ రెండేళ్ల బాలుడిపై కూడా కనికరం లేదా?

praveen
దేవుడు చేతిలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తేనో.. లేదంటే యాక్సిడెంట్ లాంటివి జరిగితేనో ప్రాణాలు పోతాయి అని అనుకుంటూ ఉంటారు జనాలు. కానీ అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య ఘటనలు సెకండ్ల వ్యవధిలో ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు.

దీంతో ప్రమాదం జరిగింది అని అర్థమయ్యేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా చాలామంది విషయంలో విధి కక్ష కట్టినట్లు గానె వ్యవహరిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అయితే అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనల గురించి తెలిసినప్పుడు అయ్యో దేవుడా అభం శుభం తెలియని చిన్నారి విషయంలో కూడా కాస్తయినా జాలి చూపించలేదా అనే భావన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 ఆ చిన్నారికి రెండేళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. కానీ అంతలోనే అతనిపై మృత్యువు కన్ను పడింది. చివరికి కరెంట్ షాక్ రూపంలో అతని ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట గ్రామంలో వెలుగు చూసింది. తగరం రమేష్ కరెంటు పని చేస్తూ ఓ పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన భార్య టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే కుట్టు మిషన్ కి విద్యుత్ మోటార్ను ఏర్పాటు చేశారు. అయితే రమేష్ కొడుకైన రెండేళ్ల బాలుడు కుట్టుమిషన్కు ఉన్న విద్యుత్ వైర్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే మహాశివరాత్రి రోజే ఈ విషాదం  జరగడంతో గ్రామస్తులు అందరూ కూడా కంటనీరు పెట్టుకున్నారు. ఇక తల్లిదండ్రులు అరణ్య రోదనగా  విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: