ఎంతో ఇష్టంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ విధి ఓర్వలే.. చివరికి?

praveen
ప్రేమలో పడిన ప్రతి ఒక్కరు కూడా తమ ప్రేమను గెలిపించుకోవాలని పెళ్లితో ఒకటవ్వాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏకంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. ఇంకొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు విధి వారి విషయంలో చిన్న చూపు చూసి ప్రేమి పెళ్లి చేసుకున్నాం అనే ఆనందాన్ని కొన్నాళ్లు కూడా లేకుండానే ఈ లోకం నుంచి తీసుకుపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి విషాదకర ఘటన గురించే. వీరు అందరి లాంటి ప్రేమజంట కాదు.. ఎంతో ప్రత్యేకం. వీరి ఆశలు ఆశయాలు వేరు.

 ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకున్నారు. అయితే అప్పటికే వీరి మధ్య ప్రేమ పుట్టింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరి ఆశయాలను మరిచిపోలేదు. కానీ పెళ్లి ఛాయలు మాసిపోక ముందే.. ఆ ఇద్దరి కుటుంబాలలో మృత్యు ఘోషలు వినబడ్డాయి. నెల్లూరు జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్, పుష్ప కొన్నాళ్ళ నుండి ప్రేమించుకున్నారు. ప్రశాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా.. పుష్ప రావుస్ విద్యాసంస్థల్లో ఎంబీఏ చదివింది. అయితే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి ఏకంగా వారిని ఒప్పించి మరి గత నెల 8న వివాహం చేసుకున్నారు..

 ప్రస్తుతం ఎంబీఏ పరీక్షలు జరుగుతూ ఉండగా.. పుష్ప ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతుంది. అయితే ఆమె పరీక్ష సెంటర్ వెంకటాచలం మండలం కాటుకూరు దగ్గర చైతన్య కళాశాలలో పడింది. ఈ క్రమంలోనే పుష్పను, ప్రశాంత్ వాహనంపై తీసుకొని తిరిగి తనను తీసుకువస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే విధి వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయింది. ఈ క్రమంలోనె ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వెళుతుండగా.. చెమూడు గుంట పంచాయతీలోని జిల్లా సైన్స్ కేంద్రం వద్దకు రాగానే.. వీరి వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. అంతలోనే వీరి వెనుకగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు దంపతులపై నుంచి వెళ్ళిపోయింది.  తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లయి నెలరోజులు కూడా కాకముందే  నూతన దంపతులు విగత జీవులుగా మారడంతో ఇక ఆ పెళ్లింటి వారందరూ కూడా అరణ్య రోతనగా  విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: