భార్య కాల్స్ ట్యాప్ చేసి.. రూ. 14 కోట్లు సంపాదించాడు.. ఎలా అంటే?

praveen
సాధారణంగా డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది చిత్ర విచిత్రమైన పనులు కూడా చేసి డబ్బులు సంపాదించడం చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటిది ఎక్కడైనా జరిగింది అంటే చాలు ఇంటర్నెట్లో వాలిపోతూ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన ఒక వార్త ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా ఎంతో సులభంగా అతను 14 కోట్ల రూపాయలు సంపాదించాడు.

 అయితే అతను 14 కోట్లు సంపాదించడానికి కారణం అతని భార్యే. ఇక ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండడమే. అంటే భార్య చేసిన సంపాదనను పోగు చేసి 14 కోట్లు సంపాదించాడేమో అనుకుంటున్నారు కదా.. అలా అనుకున్నారంటే పొరపాటే. ఏకంగా భార్యను మోసం చేసి 14.59 కోట్లు సంపాదించాడు వ్యక్తి. ఇక ఈ విషయం తెలిసీ ఏకంగా భార్య సైతం అతని మీద కేసు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయలేదు. అంతేకాకుండా ఇక భర్తతో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైంది భార్య.  భార్య విడాకులకు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యిందంటే అతను ఏదో పెద్ద మోసమే చేసి ఉంటాడు అనిపిస్తుంది కదా.. నిజమే కలలో కూడా ఊహించని పని చేశాడు ఆ భర్త.

 ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న భార్య ఆఫీస్ కాల్స్ అన్నింటినీ కూడా ట్యాప్ చేసి 14.59 కోట్లు సంపాదించాడు. టైలర్ లౌవడే అనే అమెరికన్. భార్య పని చేస్తున్న బీపీ అనే సంస్థ ట్రావెల్ సెంటర్ ఆఫ్ అమెరికా సంస్థను కొనుగోలు చేయనున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ సంస్థకు చెందిన 46వేల షేర్లను కూడా అతను కొనుగోలు చేశాడు. అయితే సంస్థ కొనుగోలు గురించి అధికారికంగా ప్రకటించిన తర్వాత.. ఆ షేర్లు అన్నింటిని కూడా అమ్మి క్యాష్ చేసుకున్నాడు. తద్వారా ఏకంగా 14.59 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇదంతా జరిగిన తర్వాత ఈ విషయం భార్యకు చెప్పడంతో అతని మీద కేసు పెట్టడానికి సిద్ధమైన భార్య.. చివరికి విడాకులు తీసుకునేందుకు కూడా రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: