వార్నీ.. బిర్యాని ఇప్పిస్తానని చెప్పగానే టవర్ దిగొచ్చాడు?

praveen
ఇటీవల కాలంలో మనుషుల ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే ఎవరిలో కూడా పెద్దగా విచక్షణ జ్ఞానం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోతున్న మనిషి అక్కడితో జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నాడు. చివరికి ఇక తన సమస్యకు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల ద్వారా నిండు నూరేళ్ల జీవితాన్ని చేజేతులారా  అర్ధాంతరంగానే ముగించుకుంటున్నాడు మనిషి.

 ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. అయితే క్షణికావేషంలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయ్. ఇంకొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి చివరికి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటివి చూస్తున్న ఎందుకో జనాల ఆలోచన తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికి అతను సెల్ఫోన్ టవర్ ఎక్కాడు.

 ఈ క్రమం లోనే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఇది గమనించిన స్థానికులు అతన్ని కిందికి దించడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయితే వంతెన పై దాదాపు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పాలి. పోలీసులు అతన్ని దింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి బిర్యాని ఇప్పిస్తాం అని హామీ ఇవ్వడం తో పాటు ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పడం తో చివరికి అతను కిందికి దిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతను గతం లో టైల్స్ వ్యాపారం చేసేవాడట. ఇక వ్యాపారం లో తీవ్ర నష్టం వాటిల్లిందని అతని భార్య కూడా అతని విడిచి పెట్టి వెళ్లిపోయిందని పోలీసు విచారణ లో  తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: