ఏపీ: సూపర్ సిక్స్ పైన చంద్రబాబు యూటర్న్.. అంతా జగనే..?

Divya
టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఏదైతే రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలించడం వల్ల రాష్ట్రం దారుణమైన పరిస్థితిలో ఉందని.. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయ్యింది అంటూ తెలిపారు. గతంలో ఐదు సంవత్సరాల పాలనలో ఎకనమిక్ గ్రోత్ 13.5 టాప్ త్రీ లో మంది కూడా ఒకటి.. దాదాపుగా నెంబర్వన్ గా చేయగలిగాము.. మ్యానుఫ్యాక్చరింగ్ 10% ఆల్ ఇండియా వైస్ గా 9.10 శాతం కలిగి ఉంది.

వ్యవసాయ అనుబంధ శాఖల 16%.. అందులో కూడా ఆక్వా కల్చర్ 29.6 % గ్రోత్ వచ్చింది.. 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటూ తెలిపారు. స్టేట్ వన్ గ్రోత్ కూడా ఆదాయంతో 13.2 శాతం వరకు పెరిగింది.. దేశంలో ఫాస్టెస్ట్ అన్నిట్లో కూడా మనకి రెండవ స్థానంలో ఉన్నది.. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగినప్పుడే.. మనం చేసే పనుల యొక్క ఫలితాలు కూడా తెలుస్తాయి.. ఆరోజు మనం 13.2 శాతానికి పెంచాము.. ఆల్ ఇండియా వైడుగా 9.2% ఉన్నది అంటూ తెలిపారు. తలసరి ఆదాయం పెంచినటువంటి రాష్ట్రం మన రాష్ట్రమంటూ తెలిపారు చంద్రబాబు.

ఆరోజు తెలంగాణ కంటే మనం అన్నిటిలో ముందుగానే వెళ్తున్నాము.. ఆల్ పారామీటర్స్ లో తెలంగాణ కంటే మనమే ముందు ఉన్నాము... తెలంగాణ ప్రాంతంతో మనం కూడా సమానంగా వెళ్లాలని సూచించాము. అసెంబ్లీలో గత చరిత్ర 2019 ప్రారంభంలో చూస్తే చాలా అభినందించేలా చేశామంటూ  చంద్రబాబు ఏదైతే ఆర్థిక శాఖ పత్రం ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో  కేవలం రాష్ట్ర మొత్తం అప్పుల పాలు అయిందంటూ తెలిపారు. దీంతో పథకాలను  అమలు చేయగలం.. కొన్ని పథకాలు కూడా అమలు చేయడానికి సుమారుగా రెండు మూడు సంవత్సరాలు పైనే పడుతుందంటే తెలియజేస్తున్నారు. అయితే ఇలా ఆర్థికంగా కూడా ఏపీ వెనుకబడడానికి ముఖ్య కారణం వైసీపీ పాలనైన అంటూ ఒక శ్వేత పత్రాన్ని కూడా చంద్రబాబు విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: