బాలయ్య అంటే భయపడుతున్న టాలీవుడ్ హీరోయిన్....?

Veldandi Saikiran

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రకుల్ వరుసగా ఫ్లాప్స్ ఎదురవడంతో కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్ళింది.

అక్కడ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కాస్త తగ్గిపోయాయి. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే.... జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసు కుంది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం బాధాకరం.

ఈ భామ గతంలో సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే దానిని రిజెక్ట్ చేసిందట. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట.  సీనియర్ హీరో బాలకృష్ణ చేసిన అఖండ మూవీ బంపర్ విజయాన్ని అందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు భార్యగా, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందట.

కానీ అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాల తో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని సమాచారం. అంతే కాదు రకుల్ ప్రీత్ సింగ్ రిజెక్ట్ చేసిన తర్వాత హీరోయిన్ కాజల్ ను అడిగారట. దింతో హీరోయిన్ కాజల్ కూడా రిజెక్ట్ చేశారట.  దీంతో ప్రగ్యా జైస్వాల్ ను సంప్రదించి ఆ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: