
మహిళ జర్నలిస్ట్ ను లైంగికంగా వేధించాడు.. సలార్ నటుడిపై చిన్మయి కామెంట్స్..!
తాజాగా సింగర్ చిన్మయి సలార్ చిత్ర నటుడైన జాన్ విజయ్ పై సంచలనా కామెంట్స్ చేసింది. ఈయన ఓ మహిళ జర్నిలిస్టును లైంగికంగా వేధించాడని, ఓ ఇంటర్వ్యూలో తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి సోషల్ మీడియాలో ఓ పోస్టులో రాసుకు వచ్చింది. విజయ్ పబ్లో, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో కూడా ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఈయన డిఎంకెకి చెందిన పర్సన్ అని, వైరముత్తు విజయ్ ఓకే జాతికి చెందిన వారని..వీరి కంటికి మహిళలు కనిపిస్తే చాలా రెచ్చిపోతారంటూ చిన్మయి కామెంట్స్ చేసింది.
ఈ పోస్ట్ నెట్ ఇంటా వైరల్ అవ్వగా..పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక జాన్ విజయ్ సలార్ చిత్రంలో రంగా రూల్ లో నటించారు. తమిళ్, తెలుగు భాషల్లో విలన్ గా నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. కల్కి సినిమా ద్వారా విజయ్ చాలా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం చిన్మయి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పోస్టును చూసిన వారంతా ఇంత దారుణంగా ఉంటాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులంతా చాలా మంచివాడు అని అనుకున్నాం మరి ఇంత దారుణమైన వాడు అని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.