అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయోమయంలో?

Suma Kallamadi
అక్కినేని వారసుడు, యువ హీరో అఖిల్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. గతంలో విడుదల అయిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. కమర్షియల్ హీరోగా అతనిని ఎస్టాబ్లిష్ చేయడానికి నాగార్జున ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఎందుకనో పెద్దగా వర్కవుట్ కావడం లేదు. మొదట వి. వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ నుండి మొన్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో చేసిన ఏజెంట్ సినిమా వరకు అన్ని సినిమాలు దాదాపుగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడి, బాడీ చేంజ్ చేసుకున్నప్పటికీ అదృష్టం వరించలేదు మన అయ్యగారికి.
ఇక ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఇప్పటివరకు ఏ సినిమాని అనౌన్స్ చేయలేదు. అయితే 100 కోట్ల బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ రెడీ అవుతుందనే టాక్ మాత్రం టాలీవుడ్లో వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ బేనర్ పైన అనిల్ కుమార్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు వినికిడి. పిరియాడిక్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండడంతో ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ కంప్లీట్ గా మార్చుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే... ఈ సినిమా భవిష్యత్తు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పైన ఆధారపడి ఉందని సమాచారం. అదేంటి.. దానికి దీనికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా?
విషయం అక్కడే ఉంది. విశ్వంభర సినిమాని యూవీ క్రియేషన్స్ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీంతో పాటుగా యూవీ క్రియేషన్స్ సూర్య కంగువ మూవీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కావడం కొసమెరుపు. దీంతో ఈ 2 సినిమాల రిజల్ట్స్ పైనే నెక్స్ట్ అఖిల్ సినిమా ఆధారపడి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తరుణంలోనే అఖిల్ సినిమా పైన అనేక రూమర్స్ వినబడుతున్నాయి. మెగాస్టార్ ఇమేజ్ మీద మూవీ మార్కెట్ చేసిన అది కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమవుతుంది. ఇతర భాషల్లో కూడా విశ్వంభర సినిమాకి సాలిడ్ ధర రావాలంటే కంటెంట్ మీద ఆధారపడి ఉంది. ఇదే సూత్రం సూర్య సినిమాకి కూడా వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: