పుట్టబోయే బిడ్డ కోసం అటువంటి నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొనే..?

lakhmi saranya
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా కల్కి మూవీలో నటించి తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కల్కి మూవీలో ఓ పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. అటు సినిమాలు చేస్తూనే, ఇటు తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక త్వరలో తల్లి కాబోతున్న ఈ బ్యూటీ తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దీపిక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆమె తన బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటుందట. అలాగే ఇతర సెలబ్రిటీల మాదిరి కేర్ టేకర్స్ ను పెట్టుకోకుండా తన బేబీని చూసుకుంటాను అంటుంది.

అంతేకాదు తన భర్త రణవీర్ సింగ్ నుంచి కూడా సహాయం తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే తన బిడ్డకు కావాల్సిన ప్రతి విషయాన్ని తానే స్వయంగా చేయాలనుకుంటుందట. దీంతో కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టేసే హీరోయిన్లు దీపికను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీపిక ప్రెగ్నెన్సీ కారణంగా అంతర్జాతీయ వెబ్ సిరీస్ ' ది వైట్ లోటస్' మూడవ సీజన్ ఆఫర్ ను కూడా తిరస్కరించింది. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు కూడా సంతకం చేయటం లేదని సమాచారం.దీపిక తన బిడ్డ కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. నాకు బిడ్డ పుడితే చాలా బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: