చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నాడు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఆ మనిషినే బానిసగా మార్చేసి ఆడిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆహారం లేకపోయినా నేటి రోజుల్లో  బ్రతకగలుగుతామేమో కానీ అరచేతిలో మొబైల్ లేదంటే మాత్రం అస్సలు బ్రతకలేము అని చెబుతూ ఉంటారు. ఇక అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి అన్ని మొబైల్ ద్వారానే సాధ్యమవుతుండడంతో  సెల్ ఫోన్ లేకుండా జీవితాన్ని కూడా ఊహించుకోలేకపోతున్నారు జనాలు.

 అయితే మొబైల్ వినియోగంతో పాటు ఇటీవల కాలంలో ఇక బ్లూటూత్ వినియోగం కూడా పెరిగిపోయింది. దీంతో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇక స్టైల్ గా ఉంటుందని ఫోన్ మాట్లాడేందుకు కొంత కంఫర్ట్ గా ఉంటుందని ఎంతోమంది బ్లూటూత్ వాడటం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బ్లూటూత్ చెవిలో పెట్టుకున్నప్పుడు ఇక చుట్టుపక్కలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా కొంతమంది మర్చిపోతున్నారు. దీంతో చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కూడా ఏకంగా చెవిలో బ్లూటూత్ చివరికి ప్రాణం తీసింది.

 హైదరాబాద్లోని బహదూర్ పురాలో ముస్లిం గూడా వాసి ప్రేమ్ కుమార్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు 26 ఏళ్ల దినేష్ కుమార్ ఫైనాన్స్ వాహనాల రికవరీ ఏజెంట్గా పని చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల బొల్లారంలో ఒక వాహనం రికవరీ చేయాల్సి ఉండడంతో ఇక చెవిలో బ్లూటూత్ పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఇంతలో మరోవైపు నుండి రైలు వేగంగా దూసుకు వచ్చింది. అయితే చెవిలో బ్లూటూత్ ఉండడంతో రైలు శబ్దం అతనికి వినిపించలేదు. దీంతో పట్టాలు దాటుతుండగా.. రైలు అతన్ని ఢీకొట్టింది. చివరికి ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు దినేష్ కుమార్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: