కారు నడుపుతుండగా గుండెపోటు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
గుండెపోటు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తుంది  ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తుంది. అప్పుడు వరకు సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా గడిపిన వారు ఉన్న ఫలంగా కుప్పకూలిపోయి అనంత లోకాల్లో కలిసిపోతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు రోజు రోజుకి ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణతీపిని పెంచుతూ ఉన్నాయి.

 దీంతో ఎప్పుడు ఏ సమయంలో గుండెపోటు వస్తుందో అని అందరూ కూడా ప్రతి క్షణం భయపడుతూనే బ్రతుకుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా మరో ప్రాణం పోయింది. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కారు నడుపుతున్న సమయంలో వ్యక్తి ఇలా సడన్  హార్ట్ ఎటాక్ కి గురయ్యాడు. దీంతో సీట్లోనే ప్రాణాలు వదిలి చివరికి ప్రాణాలు విడిచాడు. చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది అని చెప్పాలి.

 బడంగ్పేట్ కు చెందిన జైధనుంజయ్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన వయస్సు 41 ఏళ్ళు. ధనుంజయకు భార్య నందిని కుమార్తె కుమారుడు ఉన్నారు. అయితే రోజు లాగానే ధనుంజయ్ విధులకు వెళ్ళాడు. ఇంట్లో నుంచి బయలుదేరి ట్రావెల్స్ ఆఫీస్ కి వచ్చాడు. అయితే లాల్ దర్వాజా ప్రాంతంలో ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. ఇక నల్లవాగు సమీపంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కందికల్ ఆర్వోబి సమీపంలో కారు డివైడర్ పైకెక్కి నిలిచిపోయింది. అయితే ధనుంజయ్ కార్ లోనే కూర్చొని ప్రాణాలు విడిచాడు. ఇక స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: