బైపాస్ సర్జరీ సక్సెస్.. కానీ మృత్యువు ఎలా వెంటాడిందో తెలుసా?

praveen
ఈ భూమ్మీద నూకలు చనిపోయాయి అంటే  మృత్యువు ఏ రూపంలోనైనా వెంటాడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మృత్యువు నుండి  ఒక్కసారి తప్పించుకున్న ఇక మరోసారి తప్పించుకోవడం కష్టం అని అంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత పెద్దలు చెప్పేది ముమ్మాటికి నిజమే అనే భావన ప్రతి ఒకరిలో కలుగుతుంది. ఎందుకంటే ఇక అతి కష్టం మీద ఒక ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆ తర్వాత ఊహించని ప్రమాదంతో మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతనికి గుండె సమస్య వచ్చింది. దీంతో ప్రాణాలు పోతాయని అందరూ భావించారు. కానీ ఆసుపత్రిలో చేరి బైపాస్ సర్జరీ చేయించడంతో చివరికి అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. అయితే ఇలా బైపాస్ సర్జరీ చేసుకొని ప్రాణాలతో బయటపడిన అతడిని మృత్యువు మరో రూపంలో వెంటాడింది. చివరికి రోడ్డు ప్రమాద రూపంలో అతని ప్రాణాలను తీసేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లి వద్ద హైవే బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజాంబాద్ జిల్లా దూద్ గాన్ కు చెందిన పడగల బాపయ్య అనే 65 ఏళ్ల వ్యక్తికి గత నెల 28వ తేదీన యశోద ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అయితే ఇటీవల సర్జరీ కుట్లు తొలగించడానికి కొడుకు మల్లన్న కూతురు  రూపాశ్రీతో కలిసి హైదరాబాద్కు కారులో వెళ్తున్నాడు. అదే సమయంలోనే మృత్యువు వెంటాడింది. కారు టైరు పంచర్ కావడంతో ఇక కారు డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాపయ్య చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: