లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ : టీడీపీకే మొగ్గుచూపిన అధిక సర్వేలు..!

FARMANULLA SHAIK
ఏపీ పీఠం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మే 13న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ పోల్స్లో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది స్పష్టం తెలియజేశాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన సర్వేల ఆధారంగా ఈ పోల్స్ను విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చాశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ఎన్నికల పోలింగ్లో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా.. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్‌ సహా 13 మంది పోటీ చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ సహా 27 మంది పోటీలో నిలిచారు.ఇదిలా ఉంటే ఏపీలో లోక్సభ ఎన్నికలలో వివిధ సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారీగా లోక్సభ స్థానాలను టిడిపి కైవసం చేసుకుంటుందని తెలిసింది. ఆ సర్వే వివరాలు ప్రకారం

ఏపీ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ :

 
ఆత్మసాక్షి : వైసీపీ 16-17, టీడీపీ 8-9*
నేషనల్ ఫ్యామిలీ : వైసీపీ 1-10,  టీడీపీ 15-18
రింగ్ 2 పోల్ : వైసీపీ 8-10, టీడీపీ 14-17
ఎన్డీటీ సర్వే : వైసీపీ 5-8, టీడీపీ 17-20
ఏపీ కనెక్ట్ : వైసీపీ 5, టీడీపీ 20
పోల్ ప్లస్ : వైసీపీ 5, టీడీపీ 20
క్యూ మెగా : వైసీపీ 20-24, టీడీపీ 1-5

ఎగ్జిట్ పోల్స్ ని ఆధారం చేసుకుని చూస్తుంటే ఈరోజు విడుదలైనటు వంటి అన్ని సర్వేలలో ఒక్క ఆరా సర్వే తప్ప మిగిలిన అన్నీ సర్వేలు టిడిపి వైపు మొగ్గు చూపాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: