ఆరా మస్తాన్ సర్వే : ఎంపి స్థానాల్లో మాత్రం జగన్ ఆపలేకపోయిన కూటమి..!

Pulgam Srinivas
ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది అంటే రాజకీయ నాయకులతో పాటు సర్వే సంస్థల వారు కూడా చాలా బిజీ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే వారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అలాగే తమ సంస్థ పేరును నిలబెట్టుకోవడం కోసం ఆ సర్వేలను ఎంతో పకడ్బందీగా నిర్వహించి వారు విడుదల చేసే సర్వే సీట్లు , అలాగే రిజల్ట్ కూడా దాదాపుగా సమానం ఉండే విధంగా ఎన్నో పనులను చేస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఇప్పటికే ఎన్నో ఎన్నికలకు సర్వేలను నిర్వహించిన సంస్థలలో ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఒకటి. ఈ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలకి సర్వేలను చేయగా ఈ సంస్థ వారు విడుదల చేసిన సర్వే నివేదికలు మరియు వచ్చిన రిజల్ట్ కూడా దాదాపుగా దగ్గరగా ఉండడంతో ఈ సంస్థ సర్వే ను జనాలు బాగా నమ్ముతూ ఉంటారు. ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ను ఆరా మస్తాన్ సంస్థ తాజాగా విడుదల చేసింది.

ఇక ఈ సంస్థ విడుదల చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి అనే విషయాలను విడుదల చేశారు. ఈ సంస్థ ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కి 13 నుండి 15 వరకు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు , అలాగే టిడిపి , జనసేన , బిజెపి ఈ మూడు పార్టీలకు కలిపి 10 నుండి 12 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇతరులకు ఎవరికీ కూడా ఒక ఎంపీ సీటు కూడా రాదు అని ఈ సంస్థ తాజా నివేదికను విడుదల చేసింది. మరి ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక రాబోయే ఫలితాలకు ఏ మాత్రం దగ్గరగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: